Share News

RGV : ‘నేను బయట.. ఆయన లోపల’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!

ABN , First Publish Date - 2023-10-26T18:00:48+05:30 IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో అతి పనితో హాట్ టాపిక్ అయ్యాడు. నిత్యం సోషల్ మీడియాలో (Social Media) ఏదో ఒక హడావుడి చేస్తూ.. ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఉండే ఆర్జీవీ నెటిజన్లు, వీరాభిమానులతో తిట్లు, కౌంటర్లకు కొదువే ఉండదు..

RGV : ‘నేను బయట.. ఆయన లోపల’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో అతి పనితో హాట్ టాపిక్ అయ్యాడు. నిత్యం సోషల్ మీడియాలో (Social Media) ఏదో ఒక హడావుడి చేస్తూ.. ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఉండే ఆర్జీవీ నెటిజన్లు, వీరాభిమానులతో తిట్లు, కౌంటర్లకు కొదువే ఉండదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ప్రతిరోజూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్‌తో రచ్చ చేస్తున్నాడు. గత నాలుగైదేళ్లుగా వైసీపీ తొత్తుగా మారి.. ఆ పార్టీ నేతలు డబ్బులు పెడితే ఇష్టానుసారం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై (CBN, Pawan) కౌంటర్లు, సినిమాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ తీసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారితీసింది.


RGV.jpg

ఇంతకీ ఏం జరిగింది..?

తాజాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) దగ్గర సెల్ఫీ దిగిన ఆర్జీవీ రెండు ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సెల్ఫీ దిగాను.. నేను బయట ఉన్నాను.. అతను లోపల ఉన్నారు’ అని క్యాప్షన్‌తో రాసుకొచ్చాడు. ఇది చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా ఇలా ట్వీట్ చేశాడన్నది అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడీ ట్వీట్ అటు సోషల్ మీడియాలో.. ఇటు టాలీవుడ్, ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాజమండ్రిలో జక్కంపూడి గణేష్ (Jakkampudi Ganesh) వివాహ రిసెప్షన్‌కు వెళుతూ సెంట్రల్ జైలు వద్ద కారు ఆపి మరీ ఆర్జవీ సెల్ఫీ (RGV Selfie) దిగాడు. అయితే ఈ సెల్ఫీ వ్యవహారంపై టీడీపీ శ్రేణులు, నెటిజన్లు రగిలిపోతున్నారు.

Babu-Jail.jpg

ఎందుకింత అతి!

ఇదే సెల్ఫీ ఫొటోలో బ్యాగ్రౌండ్‌ను చంచల్‌గూడ జైలుగా (Chanchalguda Jail) మార్చి టీడీపీ శ్రేణులు (TDP Cadre) కామెంట్స్ చేస్తున్నాయి. అంతటితో ఆగలేదు.. చిత్ర విచిత్రాలుగా కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఆయన సొంత అభిమానులే ఓ రేంజ్‌లో తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అవును.. లోపల దేవుడు ఉన్నాడు.. వెళ్లి దర్శనం చేసుకొని రావాల్సిందని సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే పనిలో పనిగా ములాఖత్‌కు వెళ్లొచ్చు కదా అని సూచిస్తున్న పరిస్థితి. ఇంకొందరైతే.. అదే సెంట్రల్ జైలుకు త్వరలోనే తమరే వెళ్తారు రాసిపెట్టుకోండి..? అంటూ జోస్యం చెబుతున్నారు. ఈ మధ్యనే లేడీ జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు ఆర్జీవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విషయంలో కేసు పెట్టి, పక్కాగా దర్యాప్తు చేపడితే జైలులో ఆర్జీవీ ఊచలు లెక్కించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. అతి చేయొచ్చు కానీ.. ఇది మరీ టూమచ్‌గా ఉంది ఆర్జీవీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా ఒకట్రెండు కాదు వందల్లో కామెంట్స్ రావడం గమనార్హం.

jagan-ramgopal-varma.jpg


ఇవి కూడా చదవండి


CBN Case : కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌.. ఏం చెప్పిందో చూడండి!


CBN Health : చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై తీరు మార్చుకోని జగన్ సర్కార్.. ఏం జరుగుతోంది!


CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.. ఇన్నాళ్లూ ఎందుకీ గోప్యత..!?




Updated Date - 2023-10-26T18:08:54+05:30 IST