YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:20 AM
టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
కడప: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఓటర్లను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు దాడులకు సైతం తెగబడుతున్నారు. పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఓటు వేసేందుకు కానేపల్లె నుంచి అచ్చవెళ్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. ఓటు వేయడానికి వెళ్తున్న వారి కారును ఆపి రౌజీయిజం చేశారు.
టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చింతరాజుపల్లె పోలింగ్ బూత్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బూత్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కణంపల్లిలోనూ పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారంటూ స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పులివెందులలో ఉదయం 10 గంటలకు సమయానికి 20.96 శాతం పోలింగ్ నమోదు అవ్వగా.. ఒంటిమిట్టలో ఇదే సమయానికి 14.87 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎన్నికలతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అయితే, పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీసులు, ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ్గకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముందుజాగ్రత్తగా పలువురు టీడీపీ, వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు పెద్దఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు సైతం బారులు తీరినట్లు చెబుతున్నారు. వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉదయం నుంచే చురుగ్గా పోలింగ్ జరుగుతోందని, పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మైక్, ర్యాలీలపై నిషేధం విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా, పులివెందులలో 35 సంవత్సరాల తర్వాత రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మూలికల పూజ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి..