ప్రియుడి కోసం తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య..
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:08 AM
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా హత్య చేసింది భార్య. ఇందు కోసం తన తమ్ముడి సహాయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త కళ్లలో కారం కొట్టి హత్య చేసింది భార్య. అందుకోసం తన తమ్ముడి సహాయం తీసుకుంది. బుధవారం జరిగిన హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రకాశం జిల్లా (Prakasam District) డీఎస్పీ నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. 'దోర్నాల(Dornala)కు చెందిన అడపాల లాలు శ్రీను(38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సీతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. శ్రీను లారీ డ్రైవర్(Lorry driver) గా పనిచేసేవాడు. కొంత కాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రెండు నెలల క్రితం గంజాయి అమ్ముతూ ఒంగోలు జైలులో రిమాండ్ లో ఉన్నాడు.
భర్తతో కొంత కాలంగా గొడవలు జరగడంతో ఝాన్సీ తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం గురించి తెలిసిన శ్రీను రగిలిపోయాడు. ఇటీవల రిమాండ్‌లో ఉన్న అతన్ని కలవడానికి వెళ్లిన ఝాన్సీతో ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. శ్రీను బయటకు వస్తే తమను చంపేస్తాడన్న భయంతో వారంతా అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం గుంటూరుకు చెందిన ఒక గ్యాంగ్‌తో రూ.2లక్షలు సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు.
ఒంగోలు(Ongole) నుంచి బెయిల్‌పై వచ్చిన శ్రీనును చిమకుర్తి- పొదిలి మధ్య చంపాలని స్కెచ్ వేశారు. కానీ అది కుదరలేదు. చివరకు పెద్దారవీడు అంకారమ్మ గుడి సమీపంలో కారు ఆపారు. అప్పటికే బండిపై వచ్చారు సూర్యనారాయణ, అతని స్నేహితుడు. శ్రీను కళ్లలో కారం(Chilli powder) కొట్టి, కత్తితో భార్య, ఆమె తమ్ముడు పొడిచారు. దీంతో లాలు శ్రీను విలవిలలాడుతూ అక్కడే చనిపోయాడు. ఎలాగో పట్టుపడతామని భావించిన ఝాన్సీ, ఆమె తమ్ముడు ఇద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారినీ త్వరలో పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం' అని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News