జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం
ABN , Publish Date - May 05 , 2026 | 11:39 AM
ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా, మే5 (ఆంధ్రజ్యోతి): ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmassani Chandrasekhar) వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గుంటూరు ఛానల్లో గుర్రపు డెక్క పేరుకుపోతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ప్రత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్‌ను పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయలు పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు.
గుంటూరు ఛానల్ ఆధునికీకరణతో పాటు పొడిగింపు చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ ఛానల్ పనులను ముందుకు తీసుకెళ్లలేదని.. నిర్లక్ష్యంగా వదిలేశారని ఆగ్రహించారు. తమ ప్రభుత్వంలో ఈ ఛానల్‌ను 47 నుంచి 74 కిలోమీటర్ల వరకు పొడిగిస్తున్నామని తెలిపారు. రూ.70 కోట్లు ఈ ఛానల్ పొడిగింపునకు అవసరమైన భూమిని కేటాయించామని వివరించారు. 75 వేల ఎకరాల సాగు, యాభై గ్రామాలకు తాగునీరు అందుతాయని వెల్లడించారు. ఆధునికీకరణ కోసం రూ.369 కోట్లతో ప్రస్తుతం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో రైతులను ఇబ్బంది పెట్టారు: బూర్ల రామాంజనేయులు
వైసీపీ హయాంలో రైతులను ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, పొడిగిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని ప్రస్తావించారు. టీడీపీ హయాంలో గతంలో ఇచ్చిన గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, పొడగింపును వైసీపీ హయాంలో రద్దు చేశారని బూర్ల రామాంజనేయులు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
Read Latest AP News And Telangana News And International News And Telugu New