జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
ABN , Publish Date - May 06 , 2026 | 09:15 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ అండ్ కో లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (బుధవారం) విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
2019 నుంచి ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ్ కో ఎందుకు ప్రత్యేక రైల్వే జోన్‌ను సాధించలేకపోయారు? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేజోన్ సాధించుకున్న విషయం అందరికీ అర్థమైందని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల కల ఫలించిందని చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కేంద్రం సహకారంతోనే ప్రత్యేక రైల్వేజోన్‌ను సాధించుకున్నామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ
జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం
హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత
Read Latest AP News And Telangana News And International News And Telugu News