ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్
ABN , Publish Date - May 07 , 2026 | 12:51 PM
తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్, మే 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సాధించిన విజయంపై కమల్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై కమల్ హాసన్ ఎక్స్ వేదికగా తన గళాన్ని వినిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అసాధారణ ఫలితం..
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని అసాధారణ, చారిత్రాత్మక ఫలితమని కమల్ అభివర్ణించారు. టీవీకే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం సామాన్యమైనది కాదని పేర్కొన్నారు. 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేని వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయడం అంటే, ఓటు వేసిన రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. ఎన్నికైన 233 మంది ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం తమిళనాడు రాష్ట్రానికి అవమానకరమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కమల్ హాసన్ గుర్తు చేశారు.
స్టాలిన్‌పై ప్రశంసలు
ఈ సందర్భంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని కమల్ హాసన్ కొనియాడారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనమని ప్రశంసించారు. ఆయన నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నానని కమల్ హాసన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News