Share News

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 08 , 2026 | 07:02 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రేపు (శనివారం) కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


షెడ్యూల్ వివరాలివే..

సీఎం చంద్రబాబు రేపు ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7:40 గంటలకు విజయవాడ నుంచి కోల్‌కతాకు విమానంలో బయలుదేరనున్నారు. సీఎం చంద్రబాబు ప్రయాణానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రాంగణంలోనే పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.


కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు..

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సీఎం చంద్రబాబు కోల్‌కతా నుంచి తిరిగి బయలుదేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 07:18 AM