హోర్ముజ్‌లో అమెరికా వార్ షిప్‌లపై దాడి.. ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం..
ABN , Publish Date - May 08 , 2026 | 07:44 AM
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అమెరికన్ వార్ షిప్‌లపై ఇరాన్ దాడులు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా జరిపిన ప్రతిదాడుల్లో ఇరాన్ నౌకలు ధ్వంసం అయ్యాయని అన్నారు.
న్యూయార్క్, మే 8: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అమెరికన్ వార్ షిప్‌లపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అమెరికన్ వార్ షిప్‌లపై ఇరాన్ దాడులు చేసిందని తెలిపారు. అమెరికా జరిపిన ప్రతిదాడుల్లో ఇరాన్ నౌకలు ధ్వంసం అయ్యాయని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో దాడి వివరాలను వెల్లడించారు. ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ పోస్టులో.. ‘మూడు ప్రపంచ స్థాయి అమెరికన్ డిస్ట్రాయర్లపై(యుద్ధనౌకలు) ఇరాన్ దాడులు చేసింది. అయినప్పటికి యుద్ధనౌకలు విజయవంతంగా హార్ముజ్ జలసంధిని దాటి బయటకు వచ్చాయి. మా మూడు యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం కలగలేదు. మా డిస్ట్రాయర్లపైకి మిస్సైళ్లను ప్రయోగించారు. వాటిని సులభంగా కూల్చివేశాం. అలాగే డ్రోన్లు వచ్చాయి. అవి గాలిలోనే కాలి బూడిదయ్యాయి. దాడికి పాల్పడ్డ ఇరాన్ నౌకలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చిన్న పడవలతో సహా పూర్తిగా నాశనమయ్యాయి. ఆ పడవలు చాలా వేగంగా సముద్ర గర్భానికి చేరుకున్నాయి’..
‘సాధారణ దేశం అయితే మా యుద్ధనౌకలను బయటకు వెళ్లనిచ్చేది. కానీ, ఇరాన్ సాధారణ దేశం కాదు. ఆ దేశాన్ని పిచ్చివాళ్లు నడిపిస్తున్నారు. వారికి గనుక న్యూక్లియర్ మిస్సైల్స్ ఉపయోగించే అవకాశం వస్తే.. నిస్సందేహంగా ఉపయోగిస్తారు. కానీ, వారికి ఆ అవకాశం ఎప్పటికీ రాదు. వారు త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే.. భవిష్యత్తులో వారిని ఇంకా బలంగా, అత్యంత దారుణంగా దెబ్బకొడతాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి