Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 08 , 2026 | 07:18 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 08, 2026 21:26 IST

    తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

    • రేపు విజయ్‌ ప్రమాణస్వీకారంపై సందిగ్ధం

    • గవర్నర్‌కు అందని IUML, VCK మద్దతు లేఖలు

    • గవర్నర్‌ నుంచి అధికారికంగా రాని ప్రకటన

    • 116 మంది సభ్యుల లేఖ మాత్రమే అందిందన్న లోక్‌భవన్

  • May 08, 2026 20:35 IST

    ఏపీ సచివాలయంపై డ్రోన్‌ కలకలం వదంతులపై ప్రభుత్వం సీరియస్‌

    • డ్రోన్‌ కలకలమంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసుల నిర్థారణ

    • ఢిల్లీ-విజయవాడ AI 2903 విమానాన్ని డ్రోన్‌గా తప్పుడు ప్రచారం చేసినట్లు గుర్తింపు

    • సచివాలయంలో కలెక్టర్ల సదస్సు అంశాన్ని మళ్లించేందుకే ఇలా చేశారంటూ ప్రభుత్వ వర్గాల ఆగ్రహం

  • May 08, 2026 20:13 IST

    చెన్నై: TVKకు IUML మద్దతు

    • రెండుచోట్ల గెలిచిన IUML

    • INC, CPI, CPM, VCK, IUML మద్దతుతో 120కి పెరిగిన TVK సంఖ్యాబలం

  • May 08, 2026 19:42 IST

    చెన్నై: CPM కార్యాలయానికి విజయ్

    • మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన విజయ్‌

  • May 08, 2026 19:24 IST

    తమిళనాడు: TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి

    • రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం

    • నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం

    • సోమవారం లేదా మంగళవారం ప్రమాణం చేయనున్న మంత్రులు

  • May 08, 2026 19:12 IST

    చెన్నై: లోక్‌భవన్‌ నుంచి వెళ్లిపోయిన విజయ్‌

    • గవర్నర్‌తో ముగిసిన TVK చీఫ్‌ విజయ్‌ భేటీ

    • గవర్నర్‌కు మద్దతు లేఖలు అందించిన విజయ్

  • May 08, 2026 18:46 IST

    తమిళనాడు: కొత్త ప్రభుత్వ ఏర్పాటు అత్యంత అవసరం: స్టాలిన్‌

    • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశమివ్వాలి: స్టాలిన్‌

    • నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదు: స్టాలిన్‌

  • May 08, 2026 18:42 IST

    హైదరాబాద్‌: నాంపల్లి హజ్‌ హౌస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

    • యాత్రికుల బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్‌

    • కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రి అజారుద్దీన్‌, షబ్బీర్‌ అలీ, MLA జాఫర్‌

    • 430 మంది యాత్రికులతో బయల్దేరనున్న 8వ విమానం

  • May 08, 2026 18:41 IST

    టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ షరతు

    • మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్‌ కండీషన్‌

    • కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు

    • కేబినెట్‌లో చేరడం లేదని తెలిపిన వామపక్షాలు

    • తిరుచ్చి ఈస్ట్‌ తమకు కేటాయించాలని టీవీకేకు VCK షరతు

    • తిరుచ్చి ఈస్ట్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న VCK అధినేత తిరుమావళన్‌

  • May 08, 2026 17:22 IST

    బెంగాల్‌ విజయం మాకు చాలా కీలకం: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

    • శ్యామాప్రసాద్‌ ముఖర్జీకి ఈ విజయం అంకితం: అమిత్‌ షా

    • గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకూ BJP ప్రభుత్వాలు ఏర్పడ్డాయి: అమిత్‌ షా

  • May 08, 2026 17:02 IST

    పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్‌.రంగస్వామి

    • NDA శాసనసభాపక్ష నేతగా రంగస్వామి ఎన్నిక

    • NDA శాసనసభాపక్ష ఉపనాయకుడిగా ఎ.నమశ్శివాయ

  • May 08, 2026 16:35 IST

    రేపు ఉదయం 11 గంటలకు బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం

    • రేపు బెంగాల్‌లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

    • బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం

  • May 08, 2026 16:33 IST

    బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

    • బెంగాల్‌లో బీజేపీ తొలి సీఎంగా సువేందు

    • అమిత్‌ షా సమక్షంలో సీఎంగా సువేందు ఎంపిక

    • బెంగాల్‌లో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు?

    • మహిళకు ఒక డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం

  • May 08, 2026 15:55 IST

    తమిళనాడు: టీవీకే చీఫ్ విజయ్‌కి రూట్ క్లియర్

    • కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్

    • ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కి లేఖ ఇవ్వనున్న విజయ్

    • విజయ్‌కి వీసీకే, సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతు

    పూర్తి కథనం..

  • May 08, 2026 15:49 IST

    పార్వతీపురం మన్యం: కొమరాడ ప్రధాన రహదారిపై ప్రమాదం

    • కూరగాయల దుకాణం పైకి దూసుకెళ్లిన బొలెరో వాహనం

    • ఒకరి మృతి, నలుగురికి గాయాలు

  • May 08, 2026 15:39 IST

    కాసేపట్లో బెంగాల్‌ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

    • బెంగాల్‌ BJLP నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

    • రేపు ఉదయం 11 గంటలకు బెంగాల్‌ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం

  • May 08, 2026 15:39 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 516 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 150 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • May 08, 2026 15:26 IST

    బిహార్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా నిశాంత్‌ కుమార్‌

    • బిహార్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితీష్‌కుమార్‌ కుమారుడు నిశాంత్‌ కుమార్‌

  • May 08, 2026 15:18 IST

    హైదరాబాద్‌: మూసీ పునరుజ్జీవంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

    • హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం

    • మూసీ ప్రాజెక్టు 5 దశల్లో 55 కిలోమీటర్ల అభివృద్ధి..

    • ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ పునరుజ్జీవం..

    • ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు రూపకల్పన: సబ్‌ కమిటీ

  • May 08, 2026 15:18 IST

    కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు DMK ప్రకటన

    • లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు DMK లేఖ

    • కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి కూర్చోలేమని DMK స్పష్టీకరణ

  • May 08, 2026 15:04 IST

    చెన్నై: ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను మరోసారి కలవనున్న TVK చీఫ్‌ విజయ్‌

    • ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను అనుమతి కోరనున్న విజయ్‌

  • May 08, 2026 14:18 IST

    అమరావతి: ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే: సీఎం చంద్రబాబు

    • ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు: సీఎం చంద్రబాబు

    • ఇకపై ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్

    • టెక్నాలజీని వినియోగించండి.. మానవీయ కోణంతో వ్యవహరించండి

    • ప్రజల సమయాన్ని వృథా చేయొద్దు: సీఎం చంద్రబాబు

  • May 08, 2026 13:45 IST

    తమిళనాడులో కొనసాగుతోన్న రాజకీయ అనిశ్చితి

    • టీవీకేతో పొత్తుపై ఎటూ తేల్చని వామపక్షాలు

    • రేపు నిర్ణయం వెల్లడిస్తామన్న వీకేసీ పార్టీ

    • ఎమ్మెల్యేలు చేజారిపోకుండా టీవీకే జాగ్రత్తలు

    • ప్రలోభాలకు లొంగొద్దంటున్న టీవీకే అధినేత

  • May 08, 2026 13:44 IST

    తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

    • గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు

    • టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపణ

  • May 08, 2026 13:41 IST

    అమరావతి: APECET-2026 ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్

    • పరీక్షకు హాజరైన 32,434 మంది అభ్యర్థులు

    • అర్హత సాధించిన వారు 29,750 మంది అభ్యర్థులు

    • ఉత్తీర్ణత శాతం 91.72

    • ర్యాంక్ కార్డులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా చూసుకోవచ్చని తెలిపిన మంత్రి

  • May 08, 2026 13:37 IST

    ఖమ్మం కాంగ్రెస్‌ నేతల్లో అంసతృప్తి

    • నామినేటెడ్ పోస్టుల భర్తీపై రేణుకాచౌదరి వర్గీయుల అసంతృప్తి

    • పార్టీ కోసం కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతోందని అసహనం

    • కాసేపట్లో పీసీసీ చీఫ్‌తో భేటీకానున్న రేణుకా చౌదరి వర్గీయులు

  • May 08, 2026 13:36 IST

    పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌

    • పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం: సీఎం

    • కొడంగల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నాం: సీఎం

    • కొడంగల్ అభివృద్ధి కోసం అంతా కలిసి వస్తున్నారు: సీఎం

    • కొడంగల్‌లో వచ్చిన మార్పును ప్రజలంతా గమనించాలి: సీఎం

  • May 08, 2026 13:35 IST

    వికారాబాద్: కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • శ్రీవేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

    • కొడంగల్ నుంచే దౌల్తాబాద్, కోస్గి ఆలయాల పనులకు శంకుస్థాపన

    • పాల్గొన్న మంత్రులు దామోదర, వాకిటి శ్రీహరి, పలువురు నేతలు

  • May 08, 2026 12:48 IST

    కోల్‌కతా: దక్షిణేశ్వర్ కాళీమాతను దర్శించుకున్న హోంమంత్రి అమిత్ షా

  • May 08, 2026 12:46 IST

    అమరావతి: రాయలసీమ ఇక ‘రాయల్ సీమ’ అంటూ సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

    • రాయలసీమకు రాయల్ కళ వస్తుందని ప్రతిబింబించేలా ఎక్స్‌లో సీఎం పోస్ట్

    • తిరుపతిలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన దిగ్గజ మోటార్ సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్

  • May 08, 2026 12:23 IST

    చెన్నై: మరింత ఉత్కంఠ రేపుతోన్న వీసీకే చీఫ్ కామెంట్స్..

    • టీవీకే పార్టీకి మద్దతివ్వడంపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామన్న తిరుమావళవన్

    • వామపక్ష పార్టీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం: తిరుమావళవన్

    • వారి నిర్ణయం తరువాత మా నిర్ణయం ప్రకటిస్తాం: తిరుమావళవన్

    • డీఎంకే, అన్నాడీఎంకే పొత్తు కేవలం ఊహాగానాలే: తిరుమావళవన్

  • May 08, 2026 11:58 IST

    అమరావతి: అవేర్, వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

    • ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలి: సీఎం

    • ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలి: సీఎం

    • ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు: సీఎం

  • May 08, 2026 11:43 IST

    పల్నాడు: వినుకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల కలకలం

    • అన్నదాతలను నిలువునా ముంచిన విత్తన వ్యాపారి

    • వినుకొండలో 'అజిత' పేరుతో విత్తనాల విక్రయం

    • సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన రైతులు

    • ఆశించిన దిగుబడి రాక తీవ్ర నష్టాల్లో రైతులు

  • May 08, 2026 11:40 IST

    పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

    • అమిత్‌షాకు స్వాగతం పలికిన బెంగాల్ బీజేపీ నేతలు

    • ఎయిర్‌పోర్టులో అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన సువేందు

    • కొత్తగా ఎన్నికైన BJP ఎమ్మెల్యేలతో భేటీకానున్న అమిత్‌ షా

    • బెంగాల్‌ సీఎం రేసులో సువేందు సహా ఐదుగురు నేతలు

  • May 08, 2026 11:39 IST

    చెన్నై: సీనియర్ నేతలతో స్టాలిన్ కీలక సమావేశం

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ

  • May 08, 2026 11:38 IST

    హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో దారుణం

    • విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య దారుణ హత్య

    • పనిమనిషి హత్య చేసినట్టు గుర్తింపు

    • ప్రశాసన్ నగర్‌లో ఘటన.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

  • May 08, 2026 11:34 IST

    ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన బ్రిటానియా

    • ముడి పదార్థాల ధర పెరగడమే కారణమని ప్రకటన

    • పెంచిన ధరలు 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి అమలు

  • May 08, 2026 11:11 IST

    చెన్నై: కీలక వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై

    • అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ప్రజల కోరిక: ఎంపీ తంబిదురై

    • దేవుడి దయవల్ల అది జరిగే అవకాశం ఉంది: ఎంపీ తంబిదురై

  • May 08, 2026 11:02 IST

    కొత్త మలుపు తిరుగుతోన్న తమిళ రాజకీయం

    • ఎన్డీయే నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే భావిస్తున్నట్లు సమాచారం

    • డీఎంకేతో పొత్తు కోసం అన్నాడీఎంకే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం

    • టీవీకేకు మద్ధతు ఇవ్వడంపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్న వీసీకే, వామపక్షాలు

    • వీసీకే, వామపక్షాల నిర్ణయం కోసం వేచి చూస్తున్న అన్నాడీఎంకే

  • May 08, 2026 10:59 IST

    చెన్నై: కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ

    • ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్న విజయ్

    • డీఎంకే, ఏఐడీఎంకే కలిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేసేలా వ్యూహం

    • వీసీకే, వామపక్షాల నిర్ణయంపై ఆశలు పెట్టుకున్న విజయ్

    • టీవీకేకు మద్దతుపై సాయంత్రం భేటీలో నిర్ణయం తీసుకోనున్న వీసీకే

  • May 08, 2026 10:57 IST

    చెన్నై: సీపీఎం కార్యాలయంలో స్టేట్ కమిటీ సమావేశం

    • పాల్గొన్న సీపీఎం నేతలు బాలకృష్ణన్, షణ్ముగం, ఎమ్మెల్యేలు

    • టీవీకే పార్టీకి మద్దతుపై చర్చిస్తున్న నేతలు

  • May 08, 2026 10:37 IST

    టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్(TARA) ప్రయోగం సక్సెస్

    • మాడ్యులర్ రేంజ్ ఎక్స్‌టెన్షన్ కిట్ అయిన తారా, అన్‌గైడెడ్ వార్‌హెడ్‌లను ప్రెసిషన్-గైడెడ్ ఆయుధాలుగా మార్చగలదు

    • ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ

    • దీనిని డీఆర్‌డీవో, భారత వైమానిక దళం ఒడిశా తీరంలో ప్రయోగించాయి

  • May 08, 2026 10:33 IST

    విశాఖ: వైసీపీ నేతలపై ఎంపీ భరత్ ఆగ్రహం

    • రైల్వే జోన్ అంశాన్ని గత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు: ఎంపీ భరత్

    • వైసీపీ నేతలకు పరిపాలన అంటే తెలియదు: ఎంపీ భరత్

    • అభివృద్ధి అంటే ఏంటో తెలియని పార్టీ వైసీపీ: ఎంపీ భరత్

    • వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది: ఎంపీ భరత్

  • May 08, 2026 10:31 IST

    చెన్నై: లోక్‌భవన్‌ ఎదుట ఆందోళనకు దిగిన టీవీకీ సపోర్టర్

    • టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సహకరించాలని డిమాండ్

    • అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్

    • నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • May 08, 2026 10:09 IST

    హైదరాబాద్: బీజేపీ శ్రేణుల దాడిపై బీఆర్ఎస్ ఆగ్రహం

    • డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు

    • ఇవాళ ఉదయం 11 గంటలకు డీజీపీ ఆఫీసుకు బీఆర్ఎస్ నేతల బృందం

    • కరీంనగర్‌లో గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీసుపై దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్ నేతలు

  • May 08, 2026 10:01 IST

    హైదరాబాద్: చిలకలగూడలో ఉద్రిక్తత

    • అర్ధరాత్రి యువన్‌ అనే యువకుడి హత్య

    • ప్రేమ వ్యవహారమే యువన్ హత్యకు కారణమని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ

    • యువతి ఇంటి దగ్గర మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

    • మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన

    • ఘటనాస్థలిలో భారీగా మోహరించిన పోలీసులు

  • May 08, 2026 10:00 IST

    కొమురంభీం: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి జూపల్లి కృష్ణారావు

    • ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 3 జిల్లాలకు సాగునీరు అందించాలని నిర్ణయం

    • 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది

    • ముంపునకు గురయ్యే ప్రాంతాలకు నష్ట పరిహారం చెల్లిస్తాం

    • ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వాలి

  • May 08, 2026 09:29 IST

    తమిళనాడు: క్యాంపు రాజకీయాలు నడుపుతున్న అన్నాడీఎంకే

    • పుదుచ్చేరి రిసార్ట్‌ నుంచి చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

    • ఎమ్మెల్యేలను చెన్నైకి రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం

  • May 08, 2026 09:27 IST

    చెన్నై: డీఎంకే నేతలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

    • కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందంటూ డీఎంకే నేతల కామెంట్స్

    • మాట జాగ్రత్త అంటూ కౌంటర్ ఇచ్చిన మాణికం ఠాకూర్

  • May 08, 2026 09:20 IST

    కొమురంభీం: తుమ్మిడిహెట్టిలో మంత్రులు జూపల్లి, వివేక్ పర్యటన

    • ప్రాణహిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

    • నాటు పడవలపై నదీ ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి, వివేక్

  • May 08, 2026 09:19 IST

    హైదరాబాద్: రామ్‌గోపాల్‌పేట్ పోలీసుల అత్యుత్సాహం

    • అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌పై సీఐ సురేష్ దాడి

    • అర్ధరాత్రి 2గంటలకు ఏం డెలివరీ అంటూ లాఠీతో కొట్టిన సీఐ

    • దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు

  • May 08, 2026 07:52 IST

    పుదుచ్చేరి రిసార్ట్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు

    • ఆదివారం వరకూ అక్కడే ఉండాలని అధిష్టానం సూచన

    • విజయ్‌కి మద్దతు ఇవ్వొద్దని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు సమాచారం

  • May 08, 2026 07:30 IST

    నేడు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు

    • ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌ ముట్టడికి పిలుపు

    • గవర్నర్‌ వైఖరికి నిరసనగా ఆందోళనలు

  • May 08, 2026 07:29 IST

    తమిళనాడు: నేడు వీసీకే పార్టీ కీలక భేటీ

    • సాయంత్రం హైలెవెల్‌ కమిటీ సమావేశం

    • టీవీకే కి మద్దతు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్న వీసీకే

    • లెఫ్ట్‌ పార్టీలతోనూ చర్చించనున్న వీసీకే

  • May 08, 2026 07:28 IST

    అమరావతి: రేపు కోల్‌కతా పర్యటనకు సీఎం చంద్రబాబు

    • బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు

  • May 08, 2026 07:26 IST

    IPL: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ Vs కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్

    • ఢిల్లీలో రాత్రి 7:30 నుంచి మ్యాచ్‌

  • May 08, 2026 07:18 IST

    కొమురంభీం: నేడు తుమ్మిడిహట్టిలో మంత్రులు జూపల్లి, వివేక్ పర్యటన

    • ప్రాణహిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించనున్న మంత్రులు