Share News

తమిళనాడులో విజయ్‌కు లైన్ క్లియర్.. సంఖ్యా బలం రెడీ..

ABN , Publish Date - May 08 , 2026 | 03:56 PM

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను మరోసారి విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తమిళనాడులో విజయ్‌కు లైన్ క్లియర్.. సంఖ్యా బలం రెడీ..
Vijay meet Governer

  • పార్టీల వారీగా సంఖ్యాబలం ఇలా..

  • టీవీకే : 107

  • కాంగ్రెస్‌ : 5

  • సీపీఐ : 2

  • సీపీఎం : 2

  • వీసీకే : 2

చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడనుంది. తగినంత సంఖ్యాబలంతో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను మరోసారి విజయ్ కలుసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీసీకే, సీపీఎం, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయని, మద్దతు లేఖలు తీసుకుని గవర్నర్‌ను కలుస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. బుధ, గురువారాల్లో గవర్నర్‌ను విజయ్ కలిశారు. అయితే సంఖ్యాబలంతో రావాలని గవ్నరర్ సూచించడంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం తలెత్తింది.


టీవీకే బలంపరంగా చూస్తే ఆ పార్టీకి విజయ్ గెలిచిన రెండు నియోజకవర్గాలతో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ఆ బలం 113కు చేరింది. టీవీకే బలనిరూపణకు మరో ఆరు సీట్లు అవసరం. టీవీకే భవితవ్యాన్ని నిర్దేశించే బలం వీసీకే, సీపీఐ, సీపీఎం చేతుల్లో ఉంది. వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఈ పార్టీలు టీవీకేతో జతకడితే సింపుల్ మెజారిటీతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ వర్కింగ్ కమిటీ, సీపీఎం రాష్ట్ర కమిటీ టీవీకేకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఈ మూడు పార్టీలు తుది ప్రకటన చేయనున్నాయి.


ఆ మూడూ కలిసొస్తే విజయ్‌కు పట్టం.. కొనసాగుతున్న ప్రతిష్టంభన

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు.. విజయ్ మిస్టేక్ ఇదేనా?

Updated Date - May 08 , 2026 | 05:14 PM