కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారు.. మంత్రి వివేక్ ధ్వజం
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:44 PM
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
సిద్దిపేట జిల్లా, జూన్11, (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈరోజు (గురువారం) అక్బర్‌పేట భూంపల్లి మండలం నగరం రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. కాంగ్రెస్‌ది పేదల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు పదివేల ఇళ్లు ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు 50 శాతం వరకు స్లాబ్ లెవల్‌కు వచ్చాయని మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. ఎవరైనా ఇళ్లు లేని వారు కట్టుకుంటామని చెబితే.. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని స్పష్టం చేశారు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడించారు. రూ.300 కోట్లు తెలంగాణ ఆర్టీసీకి కేటాయించామని వివరించారు. సిద్దిపేట జిల్లాకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. స్కూల్ పిల్లలకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్‌మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఫ్రీగా అందజేస్తున్నామని అన్నారు. రెండు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్ అన్నారని చెప్పారు. రాష్ట్రంలో సరిపోయినంత యూరియా ఉందని.. కొరతలేదని చెప్పుకొచ్చారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా రైతన్నలకు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News