జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ABN , Publish Date - May 17 , 2026 | 11:23 AM
ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నల్లగొండ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkata Swamy) వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈరోజు (ఆదివారం) మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడి రెక్క శౌరి అంత్యక్రియలో పాల్గొని నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తాం..
ధాన్యం కొనుగోలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ, నకిరేకల్‌లలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని.. ఇందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల రక్షణ కోసం ఆయా ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఫార్మారంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధివిధానాల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన
Read Latest Telangana News And AP News And International News And Telugu News