Home » Miryalguda
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదవంలో ముగ్గురు మృతి చెందారు..
ప్రణయ్ పరువు హత్య కేసులో గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. శ్రవణ్ జీవిత ఖైదును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
మిర్యాలగూడలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్‌నుమా.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తానని ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ వాంకుడోతు సరిత నాయక్ అన్నారు. విధుల్లో చేరడానికి మంగళవారం మిర్యాలగూడకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీకి మాజీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారి మిర్యాలగూడలో ఆదివారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రైతు కుటుంబానికి రెండెకరాల పోడు భూమే జీవనాధారం. ఆరేళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుబండి లాగిస్తున్నాడు. ఇటీవల ఆ భూమి తమ పరిధిలోకి వస్తుందంటూ అటవీ అధికారులు చెప్పడంతో.. ఆ రైతు గుండె ఆగినంతపనైంది. తన కుటుంబానికి దిక్కుగా ఉన్న ఆ భూమిని తీసుకుంటే.. తాను బతకలేనని, ఉరేసుకుంటానని చెప్పిన ఆ రైతు అన్నంత పని చేశాడు.