Pranay Honor Assasination Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం.. శ్రవణ్ కుమార్‌కు బెయిల్..
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:01 AM
ప్రణయ్ పరువు హత్య కేసులో గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. శ్రవణ్ జీవిత ఖైదును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రణయ్ పరువు హత్య కేసులో గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. శ్రవణ్ జీవిత ఖైదును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరాడు. తెలంగాణ హైకోర్టు శ్రవణ్ వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిలు మంజూరు చేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు..
2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కూతురు అమృత వేరే సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి నచ్చని మారుతీరావు.. సుపారీ గ్యాంగ్ సాయంతో ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు.
బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే వ్యక్తి ప్రణయ్‌ని చంపేశాడు. ఈ కేసులో సుభాష్, మారుతీ రావు, శ్రవణ్ కుమార్‌లు అరెస్ట్ అయ్యారు. మారుతీ రావు, సుభాష్ శర్మలు బెయిల్ మీద విడుదల అయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీ రావు చింతల్‌బస్తీలోని ఆర్య వైశ్య సత్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇది పూర్తిగా స్వదేశీ టెస్లా.. ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
ఈమె అత్తారింటికి వెళ్తోందా, జైలుకు వెళ్తోందా.. ఆమె తీరు చూస్తే నవ్వుకోవాల్సిందే..