Share News

Desi Tesla: ఇది పూర్తిగా స్వదేశీ టెస్లా.. ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..

ABN , Publish Date - Jan 08 , 2026 | 10:55 AM

బీహార్‌కు చెందిన ఓ కుర్రాడు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ జీప్‌ను తయారు చేసి సంచలనం సృష్టించాడు. గ్రామాల్లో ఉండే రైతులు, చిన్న వ్యాపారుల రోజువారీ ప్రయాణాలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించగల జీప్‌ను తయారు చేశాడు.

Desi Tesla: ఇది పూర్తిగా స్వదేశీ టెస్లా.. ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
low cost electric vehicle

బీహార్‌లోని పూర్నియాకు చెందిన ఆ కుర్రాడి పేరు ముర్షీద్ ఆలం.. పెద్ద ఇంజనీర్, స్టార్టప్ వ్యవస్థాపకుడు కాదు.. అతను ఒక సాధారణ మెకానిక్.. గ్యారేజీలో వాహనాలను రిపేర్ చేసేవాడు.. ఆ తర్వాత సొంతంగా షాప్ పెట్టుకుని మంచి మెకానిక్‌గా పేరు తెచ్చుకున్నాడు.. అక్కడితో ఆగకుండా తన ప్రతిభను ఉపయోగించి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ జీప్‌ను తయారు చేసి సంచలనం సృష్టించాడు (homemade electric car).


గ్రామాల్లో ఉండే రైతులు, చిన్న వ్యాపారుల రోజువారీ ప్రయాణాలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించగల తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలు లేవు. ఇది ముర్షీద్‌లో ఒక ఆలోచనను రేకెత్తించింది. గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా ఓ ఎలక్ట్రిక్ జీపును ఎందుకు తయారు చేయకూడదు అని ఆలోచించి పని ప్రారంభించాడు. ముర్షీద్ ఆలం ఒంటరిగా ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీప్‌ను కేవలం 18 రోజుల్లో తయారు చేశాడు. ఈ జీప్‌నకు ప్రత్యేకంగా ఒక ట్రాలీని కూడా అమర్చవచ్చు (EV runs 100 km per charge).

tesla2.jpg


ఈ వాహనంతో రైతులు పంటలు, ఎరువులు, ఇతర సామాగ్రిని రవాణా చేసుకోవచ్చు (low cost electric vehicle). ఈ జీప్‌ను ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ జీప్ ఖరీదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ జీప్‌నకు నాలుగు ట్యూబ్‌లెస్ టైర్లు, స్పీడోమీటర్, ఛార్జింగ్ పాయింట్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ జీప్‌ను డ్రైవింగ్ చేయడం కూడా చాలా సులభం. ఈ జీప్‌ తయారు చేసిన ముర్షీద్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..


కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

Updated Date - Jan 08 , 2026 | 11:21 AM