Share News

Birds on power lines: కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:13 PM

విద్యుత్‌ను సరఫరా చేసే తీగలు చాలా ప్రమాదకరం. వాటి జోలికి వెళితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు మాత్రం ఏమీ కాదు. పక్షులు హాయిగా కరెంట్ తీగలపై కూర్చుంటాయి. అయినా అవి ప్రాణాలతోనే ఉంటాయి.

Birds on power lines: కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..
interesting science facts

విద్యుత్‌ను సరఫరా చేసే తీగలు చాలా ప్రమాదకరం. వాటి జోలికి వెళితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు మాత్రం ఏమీ కాదు. పక్షులు హాయిగా కరెంట్ తీగలపై కూర్చుంటాయి. అయినా అవి ప్రాణాలతోనే ఉంటాయి. మరి, వాటికి షాక్ కొట్టకపోవడానికి గల కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది (electricity science).


సాధారణంగా విద్యుత్ ప్రవహించాలంటే, పూర్తి సర్క్యూట్ అవసరం. విద్యుత్ ఎప్పుడూ ఎక్కువ వోల్టేజ్ ఉన్న స్థానం నుంచి తక్కువ వోల్టేజ్ ఉన్న స్థానం (సాధారణంగా భూమి) వైపు ప్రవహిస్తుంది. ఒక జీవికి షాక్ తగలాలంటే, విద్యుత్ శరీరంలోకి ప్రవేశించి మరో చోట నుంచి బయటికి వెళ్లాలి. అప్పుడే సర్క్యూట్ పూర్తవుతుంది. సాధారణంగా పక్షులు ఒకే కరెంట్ తీగపై కూర్చుని ఉంటాయి. ఆ సమయంలో వాటి రెండు కాళ్లకూ ఒకే వోల్టేజ్ ఉంటుంది. కాబట్టి విద్యుత్ ప్రవహించదు. అందుకే వాటికి షాక్ తగలదు (bird safety electricity).


మరి, పక్షులకు ఎప్పుడు షాక్ కొడుతుంది (power lines facts). ఏదైనా కారణం చేత పక్షి శరీరం పక్కనే ఉన్న మరో కరెంట్ తీగకు తగిలితే అప్పుడు వోల్టేజ్ తేడా ఏర్పడి, పక్షి శరీరం గుండా విద్యుత్ ప్రవహించి షాక్ కొడుతుంది. అలాగే కరెంట్ తీగతో పాటు వేరే వస్తువును (స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్) తాకినప్పుడు కూడా వాటికి షాక్ కొడుతుంది. అందుకే పెద్ద రెక్కలున్న పక్షులే ఎక్కువగా కరెంట్ షాక్‌కు గురవుతుంటాయి. మనుషులు భూమిపై నిలబడి ఉండగా, విద్యుత్ తీగను తాకితే సర్క్యూట్ పూర్తవుతుంది. ఫలితంగా షాక్ తగులుతుంది.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఇతడు మనిషేనా.. ఇంటిపై వేలాడుతూ బల్లిలా ఎలా చేస్తున్నాడో చూడండి..


ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..

Updated Date - Jan 07 , 2026 | 12:31 PM