Dangerous Stunt: వామ్మో.. ఇతడు మనిషేనా.. ఇంటిపై వేలాడుతూ బల్లిలా ఎలా చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:43 AM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (dangerous exercise video).
@rose_k01 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు అత్యంత ప్రమాదకరంగా వ్యాయామం చేస్తున్నాడు. ఓ ఇంటి పైకప్పుపై నిల్చుని ఉన్నాడు. ఆ తర్వాత పైకప్పు రెయిలింగ్ నుంచి కిందకు వచ్చి సగంలో వేలాడుతూ పుష్-అప్‌లు చేయడం ప్రారంభించాడు. అతడు చాలా సులభంగా ఆ స్టంట్‌ను పూర్తి చేశాడు. బల్లి మాదిరిగా గోడకు అతుక్కుని పుష్-అప్‌లు చేసేశాడు. ఏదైనా తేడా వస్తే మాత్రం పెద్ద ప్రమాదం జరగడం ఖాయం (boy hanging from ceiling).
ఆ ప్రమాదకర స్టంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (risky workout stunt). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 31 వేల మందికి పైగా వీక్షించారు. వందలాది మంది ఆ వీడియోను లైక్ చేసి కామెంట్లు చేశారు. అతడు రీల్ కోసం పెద్ద ప్రమాదంతో ఆడుకుంటున్నాడని ఒకరు కామెంట్ చేశారు. విపరీతంగా సాధన చేయడం వల్లే అతడు అంత ప్రమాదకర స్టంట్‌ను సులభంగా పూర్తి చేశాడని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..