Share News

Maduro limps to courthouse: వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:19 PM

తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Maduro limps to courthouse: వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
Maduro latest news

అమెరికా డెల్టా ఫోర్స్‌ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను కస్టడీలోకి తీసుకుంది. తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారు (Maduro limps to courthouse).


మదురోపై ఉన్న నార్కో టెర్రరిజం ఆరోపణలను జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ చదివి వినిపించగా.. అందుకు మదురో సమాధానం ఇస్తూ, తాను నిర్దోషినని, తనకు ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు. అంతకు ముందు మదురోను కోర్టుకు తీసుకెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో మదురో కుంటుతున్నట్టు నడుస్తున్నారు. మదురో చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయి. బూడిద రంగు ట్రాక్‌సూట్ ధరించి ఉన్న ఆయన సాయుధ ట్రక్కు నుంచి దిగి నెమ్మదిగా హెలికాఫ్టర్ వైపు నడుస్తున్నారు (Maduro court appearance). ఆ వీడియో చూసిన వాళ్లు మదురోకు గాయాలు అయినట్టు అనుమానిస్తున్నారు.


మదురో ఇప్పటికీ తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా న్యాయమూర్తికి పరిచయం చేసుకున్నారు ( Maduro trial visuals). తాను అక్కడ కిడ్నాప్‌నకు గురయ్యానని చెప్పారు. కాగా, మదురో భార్య సిలియా ఫ్లోర్స్ కూడా న్యాయమూర్తికి తన వాదన వినిపించారు. తాను ఏ తప్పు చేయలేదని, పూర్తిగా అమాయకురాలినని జవాబు ఇచ్చారు. కాగా, మదురోపై మోపిన అభియోగాలను క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్.. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 12:19 PM