Delcy Rodriguez Sai Baba devotee: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు.. సత్యసాయి బాబా భక్తురాలు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:54 AM
మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం.
వెనెజువెలాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతడి భార్య సిలియాను అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తీసుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మదురో స్థానంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్ (Delcy Rodríguez)ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషం (Delcy Rodriguez Andhra ashram visit).
వెనెజువెలా ఉపాధ్యక్షురాలి హోదాలో డిల్సీ రోడ్రిగ్స్ పలుసార్లు పుట్టపర్తి ఆశ్రమాన్ని దర్శించారు. సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి బాబా మహా సమాధిని సందర్శించుకుని నివాళులు అర్పించారు. అప్పటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 2023 ఆగస్ట్‌లోనూ, 2024 అక్టోబర్‌లోనూ రోడ్రిగ్స్ పుట్టపర్తి వచ్చారు. సత్యసాయి బాబా, బ్రహ్మ కుమారీలు, రాధా స్వామి అనుచరులు, పలు భారతీయ గురువులు, సంస్థలు వెనెజువెలాలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలను స్థాపించారు (Venezuela leader India spiritual link).

అక్టోబర్ 26, 2024న రోడ్రిగ్స్ పుట్టపర్తి వచ్చినపుడు ఆమెతో పాటు భారతదేశంలో వెనెజువెలా రాయబారి కాపయా గొంజాలెజ్ కూడా ఉన్నారు (Sai Baba devotees world leaders). శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్.. రోడ్రిగ్స్‌కు స్వాగతం పలికి ఆశ్రమం అంతా చూపించారు. బాబా దివ్య సన్నిధిలో గడపడం తనకు ప్రశాంతతను ఇచ్చిందని రోడ్రిగ్స్ ఆ సమయంలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..