Share News

Iran protests: ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..

ABN , Publish Date - Jan 07 , 2026 | 07:11 AM

ఇరాన్‌లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

Iran protests: ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..
protests in Iran

ఇరాన్‌లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీంతో ప్రజల శాంతియుత నిరసనలను అణిచివేయడానికి ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దించడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. భద్రతా దళాలు ఇప్పటివరకు 1200 మంది నిరసనకారుల్ని నిర్బంధించాయి (Iran economic crisis).


నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 35 మంది మరణించారు. ఇలామ్‌లోని సెంట్రల్ ప్రావిన్స్‌లోని అబ్దానన్ నగరంలో మంగళవారం రాత్రి భారీ నిరసనలను నిర్వహించారు. యువకులు, పెద్దలు, పిల్లలు, వృద్ధుల వరకు వేలాది మంది ప్రజలు నగరంలోని వీధుల్లో నడుస్తూ, నినాదాలు చేశారు. వారిని నిలువరించడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. ప్రావిన్స్ రాజధాని ఇలాం నగరంలో, నిరసనకారులను అరెస్టు చేయడానికి భద్రతా దళాలు ఇమామ్ ఖొమేని ఆసుపత్రిపై దాడి చేశాయి (Iran unrest news).


ఇరాన్‌లో 31 రాష్ట్రాలు ఉండగా, వాటిల్లో 27 రాష్ట్రాల్లో ప్రస్తుతం నిరసనలు కొనసాగుతున్నాయి (protests in Iran today). ఈ నిరసనల్లో 250 మంది పోలీసులు, 45 మంది ఇతర బలగాలు సిబ్బంది గాయపడినట్టు సమాచారం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఇరాన్ ప్రభుత్వం చంపితే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..


స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 07 , 2026 | 07:35 AM