Funny wedding video: ఈమె అత్తారింటికి వెళ్తోందా, జైలుకు వెళ్తోందా.. ఆమె తీరు చూస్తే నవ్వుకోవాల్సిందే..
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:33 AM
పెళ్లి తర్వాత అమ్మాయిల జీవితం చాలా వరకు మారిపోతుంది. పుట్టి పెరిగిన ఇంటిని, ఊరిని, కుటుంబ సభ్యులను వదిలి అత్తారింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా, తర్వాత భర్తతో కలిసి వెళ్లిపోతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వధువు తీరు చూస్తే మాత్రం నవ్వు రాక మానదు.
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల జీవితం చాలా వరకు మారిపోతుంది. పుట్టి పెరిగిన ఇంటిని, ఊరిని, కుటుంబ సభ్యులను వదిలి అత్తారింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా బాధపడడం, భావోద్వేగానికి గురికావడం సహజం. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా, తర్వాత భర్తతో కలిసి వెళ్లిపోతారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వధువు తీరు చూస్తే మాత్రం నవ్వు రాక మానదు (bride viral video).
knowledgemedia07 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పెళ్లి తర్వాత వధువు తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ వధువు ఏడుపు ప్రారంభించింది. భర్తతో కలిసి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరు మహిళలు ఆ వధువును ఎత్తుకుని మోసుకెళ్తున్నారు. ఒకరు ఆమె కాళ్లను, మరొకరు తలను పట్టుకుని మోసుకుంటూ బయటకు తీసుకొస్తున్నారు. ఆ సమయంలో వధువు హృదయవిదారకంగా ఏడుస్తోంది (wedding humor).
ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (hilarious bride clip). ఈ వైరల్ వీడియోను దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 24 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి కామెంట్లు చేశారు. 'ఈమెను అత్తారింటికి తీసుకెళ్తున్నారా, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారా' అని ఒకరు ప్రశ్నించారు. తనను చిన్నప్పుడు స్కూల్‌కు అలాగే తీసుకెళ్లేవారని మరొకరు కామెంట్ చేశారు. ఆ వధువు అత్తారింటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..
కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..