Massive Fire Accident in Telangana: తెలంగాణలో అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:07 PM
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
హైదరాబాద్, నల్లగొండ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ (Telangana)లో ఇవాళ(ఆదివారం) వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని మణికొండ (Manikonda), మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటనా విషయం తెలియడంతో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మణికొండలో..
మణికొండలో ఇవాళ(ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. బీఆర్సీ అపార్ట్‌మెంట్ ఎలక్ట్రికల్ వైర్స్ డక్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలను చూసి కిందకు పరుగులు తీశారు అపార్ట్‌మెంట్ వాసులు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్ని మాపక సిబ్బంది. నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎలక్ట్రికల్ డక్ యూనిట్‌లో వైర్లు పూర్తిగా కాలిపోవడంతో 19 ఫోర్ల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంటలను చూసి కిందకు పరుగులు తీసే క్రమంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మిర్యాలగూడలో...
మిర్యాలగూడ (Miryalaguga) పట్టణం హనుమాన్ పేటలో మరో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శ్రీ లక్ష్మీ పవన్ ఎలక్ట్రికల్స్, విజయలక్ష్మి ఆటోమోటివ్స్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఎలక్ట్రికల్, ఆటోమోటివ్స్ పరికరాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి చుట్టూ పక్కల ప్రాంతాలకు పొగ అలుముకుంది.
పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
Read Latest Telangana News and National News