Miryalaguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:16 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదవంలో ముగ్గురు మృతి చెందారు..
నల్లగొండ, జనవరి9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Miryalaguda Accident) జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల వివరాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలోని మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. వీరిలో బీరు బాయ్ (30), సంతోష్ (30), సూరజ్ (18) ఉన్నారు. డీసీఎంలో ఉన్న టైల్స్ కూలీల మీద పడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల చర్యలు..
టైల్స్‌ను హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ సహాయంతో రహదారిపై నుంచి లారీని, డీసీఎంను తొలగించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాగ్రత్తగా వెళ్లాలి..
మిర్యాలగూడలోని ఈ రహదారిపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి..
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
Read Latest Telangana News And Telugu News