Share News

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 15 , 2026 | 06:58 PM

గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు. తన గీత తాను దాట‌నని స్పష్టం చేశారు. ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్ వేదికగా సీఎం మాట్లాడారు. టీడీపీలో పదేళ్లు ప‌నిచేశానని.. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికి తనను గౌర‌విస్తారని ప్రస్తావించారు. పార్టీని వ‌దిలిపెట్టిన త‌ర్వాత నాయ‌కుల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం చాలా అరుదని తెలిపారు.


జ‌నం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారు..

పార్టీని వ‌దిలిపెట్టే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పి వ‌చ్చానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను దేశంలో అధికారంలోకి తేవాల‌ని రాహుల్ గాంధీ‌కి ల‌క్ష్యం ఉందని.. కాని ప్ర‌ధాని కావాల‌న్న ల‌క్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోవాల‌ని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని ప్రస్తావించారు. ఇప్పుడు జ‌నం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి నుంచి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముందు ప్ర‌క‌టించి త‌ర్వాత ఇండియా కూట‌మిని కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఒప్పిస్తామని తెలిపారు.


దేశానికి కూడా సేవ‌లందిస్తా..

ఇండియా కూట‌మి తరపున ఒక పాల‌సీ డాక్యూమెంటును తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీర్పు ఇవ్వ‌మ‌ని కోర‌తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వ‌ర‌కు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 వ‌ర‌కు తాను తెలంగాణ‌లోనే ఉంటానని.. ఇక్కడి ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తానని తెలిపారు. ప‌దిశాతం జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా ప‌నిచేస్తానని స్పష్టం చేశారు. 2034 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రినని చెప్పుకొచ్చారు. 2034 త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌నని.. త‌ర్వాత త‌రానికి అవ‌కాశం ఇస్తానని తెలిపారు. దేశానికి కూడా సేవ‌లందిస్తా అని.. తన అనుభ‌వాన్ని దేశం కోసం పంచుతానని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేసిన తర్వాత.. ఆయ‌న ఏ బాధ్యతలు అప్పగించిన తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 07:48 PM