Share News

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ABN , Publish Date - May 14 , 2026 | 02:26 PM

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
Maheshwar Reddy

నిర్మల్, మే 14 (ఆంధ్రజ్యోతి): వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కనీసం 40శాతం కూడా పంటల కొనుగోళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈరోజు (గురువారం) నిర్మల్ జిల్లాలో రైతు ధర్నాలో మహేశ్వర్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు.


రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు..

పంట కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీసంచులను కూడా సరఫరా చేయలేని దీనావస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ, తరుగు పేరిట రైతులను దగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహేశ్వర్‌ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 02:56 PM