Share News

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - May 13 , 2026 | 09:52 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన ఈరోజు (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎయిర్‌పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్ల పనులు చేపట్టాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. లీజ్‌కు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని స్పష్టం చేశారు.


సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలి..

ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అర్బన్ సెంట్రిక్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిచోట స్మార్ట్‌పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా నగరాలు, పట్టణాల జనాభా తగినట్లు స్థానికంగా డిజైన్ చేసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణపైన ఏఐ వినియోగంపైన సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వాడేలా నిబంధన పెట్టాలని ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు కావాల్సిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిర్దేశించారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా చేయాలని దిశానిర్దేశం చేశారు.


టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలి..

సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగూడం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని అన్నారు. రేడియల్ రోడ్లు పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా డిజైన్ చేయాలని సూచించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని వివరించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుందని చెప్పుకొచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్‌పోల్స్, రోడ్ల, ఎస్‌టీపీలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాలపైన ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం

మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 10:01 PM