Share News

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - May 12 , 2026 | 08:55 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది.

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం
Bandi Bhagirath Case

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో (Bandi Bhagirath Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు.


పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ..

సిట్ అధికారులు బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌ను విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు చేసిన అనంతరం పోలీసులు ఈ కేసులోని సెక్షన్లను మార్చారు. గతంలో నమోదు చేసిన 74, 75 BNS, సెక్షన్ 11 రీడ్ విత్ పోక్సో యాక్ట్ సెక్షన్లను సవరించారు.

WhatsApp Image 2026-05-12 at 7.31.19 PM.jpeg


కఠినమైన పోక్సో సెక్షన్లు నమోదు..

తాజాగా పోలీసులు సెక్షన్ 5(1) రీడ్ విత్ సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. ఇవి పోక్సో చట్టంలోని తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్లుగా పరిగణించారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేశారు. బాధితురాలి వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

WhatsApp Image 2026-05-12 at 7.43.22 PM.jpeg


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 09:07 PM