Share News

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

ABN , Publish Date - May 13 , 2026 | 06:09 PM

పేట్ బషీరాబాద్ పోలీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ లేఖ పంపించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Bandi Bhagirath Case

హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పేట్ బషీరాబాద్ పోలీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath Case) ఓ లేఖ పంపించారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఈమెయిల్‌తో పాటు అధికారిక లేఖను కూడా బండి భగీరథ్ పంపించారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని ఆయన స్పష్టం చేశారు.


అలాగే సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని భగీరథ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో అవసరమైన సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బండి భగీరథ్ పంపిన లేఖ ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 15వ తేదీన జరగనున్న విచారణలో ఆయన సమర్పించే ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

Updated Date - May 13 , 2026 | 06:22 PM