Share News

తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉపాధి కల్పిస్తాం: మంత్రి వివేక్

ABN , Publish Date - May 12 , 2026 | 02:39 PM

తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు.

తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉపాధి కల్పిస్తాం: మంత్రి వివేక్
Minister Vivek Venkat Swamy

హైదరాబాద్, మే12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkat Swamy) వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' (Triple Win) ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు. ఈ ప్రోగ్రాం కింద శిక్షణ పొందిన సుమారు 79 మంది నర్సులు త్వరలోనే జర్మనీకి వెళ్లనున్నారని తెలిపారు. జర్మనీలో రోగులతో సంభాషించడానికి జర్మన్ భాష అత్యంత అవసరమని, అందుకే నర్సులకు 'B2' స్థాయి వరకు భాషా శిక్షణ ఇప్పిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.


ముఖ్యమంత్రి విదేశీ విద్యానిధి కింద, అభ్యర్థుల వీసా, ఇతర ఖర్చులపై ప్రభుత్వం 50శాతం సబ్సిడీ అందిస్తోందని హామీ ఇచ్చారు. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, ప్రభుత్వ సంస్థ అయిన 'టామ్‌కామ్' ద్వారా ఈ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, శిక్షణ పొందిన విద్యార్థులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిక్షణలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 02:46 PM