Share News

భవన నిర్మాణ రంగ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి వివేక్..

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:56 PM

భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

భవన నిర్మాణ రంగ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి వివేక్..
Minister Vivek Venkataswamy

సిద్దిపేట జిల్లా: భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇచ్చేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వివేక్ భరోసా కల్పించారు.


సింగరేణి కార్మికుల సంక్షేమానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కృషి చేశారని మంత్రి వివేక్ చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో కొట్లాడి మరీ సింగరేణి భూముల రక్షణ, కార్మికుల పెన్షన్లకు ఎంతో చేశారని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి మార్గంలోనే కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలనేది తన తపనంటూ చెప్పుకొచ్చారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులకు ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచామని.. గిగ్ వర్కర్స్ భద్రత కోసం చట్టాన్నీ అసెంబ్లీలో ప్రవేశపెట్టామని అన్నారు.

హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు వివేక్. సిద్దిపేటలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం భవనానికి స్థల కేటాయింపుతోపాటు దాని నిర్మాణానికీ మాట ఇస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే మాజీ మంత్రి హరీశ్ రావు ఇక్కడ హామీలు ఇచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

క్రాస్ బ్రీడ్ ఎవరు..? కేటీఆర్‌పై సంజయ్ కుమార్ సెటైర్లు

Updated Date - Apr 19 , 2026 | 03:11 PM