Share News

వరంగల్‌లో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:54 PM

వరంగల్‌లో కొలువుదీరిన భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రకాళీ అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

వరంగల్‌లో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వరంగల్, ఏప్రిల్19: వరంగల్‌లో కొలువుదీరిన భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రకాళీ అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళీ అమ్మ వారని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి.


ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి కారణంగా అధిక ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.


30వ తేదీతో ముగియనున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు..

  • 20వ తేదీన అగ్నిప్రతిష్ట, చతుష్టానార్చన, వృషభ వాహన సేవ, మృగ వాహన సేవ.

  • 21వ తేదీన శంకర జయంతి, మకర వాహన సేవ, చంద్ర ప్రభ సేవ, శ్రీభద్రకాళీభద్రేశ్వరుల ఎదుర్కోలు.

  • 22వ తేదీన సింహ వాహన సేవ, గజవాహన సేవ, శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం.

  • 23వ తేదీన సదస్యం సూర్యప్రభ వాహన సేవ, హంస వాహన సేవ.

  • 24వ తేదీన పలక్లీ సేవ, శేష వాహన సేవ.


  • 25వ తేదీన గంధోత్సవం, సాలభంజికసేవ.

  • 26వ తేదీన రథోత్సవం

  • 27వ తేదీన డోలోత్సవం, భద్ర పీఠ సేవ, ఆశ్వ వాహనసేవ.

  • 28వ తేదీ వసంతోత్సవం, చతురన్తసేవ, విమానసేవ.

  • 29వ తేదీ శరభవాహన సేవ, పుష్పరథ సేవ.

  • 30వ తేదీ పుష్పయాగం ఉత్సవాల ముగింపు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు-నరసాపురం రైలులో దొంగలు హల్‌చల్.. భారీ చోరీ

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్.. ఎందుకంటే..?

For TG News And Telugu News

Updated Date - Apr 19 , 2026 | 01:17 PM