Share News

బెంగళూరు-నరసాపురం రైలులో దొంగలు హల్‌చల్.. భారీ చోరీ

ABN , Publish Date - Apr 19 , 2026 | 07:19 AM

బెంగళూరు - నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరిగింది. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు.

బెంగళూరు-నరసాపురం రైలులో దొంగలు హల్‌చల్.. భారీ చోరీ
Bengaluru-Narsapur Special Express train

బాపట్ల, ఏప్రిల్19: బెంగళూరు - నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు హల్‌చల్ చేశారు. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి సుమారు 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం అప్పికట్ల వద్ద రైలు ఆపి.. దొంగలు పరారయ్యారు. బాధితులు విజయవాడ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.


బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న రైలులో ఎస్ 7, ఎస్11, ఎస్12, ఎస్13 కోచ్‌లలో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులను బెదిరించి.. మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామంటూ దుండగులు బెదిరించారు. దీంతో ప్రయాణికులు.. తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలన్నీ దొంగలకు తీసి ఇచ్చారు. ఆ తర్వాత అప్పికట్ల వద్ద దొంగలు రైలు చైన్ లాగి పరారయ్యారు. ఈ చోరీకి సంబంధించిన వివరాలను ప్రయాణికుల నుంచి పోలీసులు సేకరించారు. ఈ సందర్భంగా రైలులో చోరీలకు పాల్పడిన పాత నేరస్థుల జాబితాను పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎన్ఎంసీకి విద్యార్థి ఫిర్యాదు

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

For More AP News And Telugu News

Updated Date - Apr 19 , 2026 | 07:41 AM