Share News

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:20 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని విమర్శించారు. బీజేపీతో ఆయన పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం
YS Sharmila

అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని విమర్శించారు. బీజేపీతో ఆయన పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగిందని తెలిపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా..? అని ప్రశ్నించారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా..? అని ఎద్దేవా చేశారు. ఇదేనా జగన్ చెప్పే వైఎస్సార్ ఆశయాలు, వారసత్వం..? అని నిలదీశారు. మహానేత వైఎస్సార్ సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.


వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తోంది..

జగన్ చేసిన నీచపు పనికి వైఎస్సార్ ఆత్మ నిజంగా ఘోషిస్తోందని షర్మిల విమర్శించారు. మహిళా బిల్లును, డీ లిమిటేషన్‌కి లింక్ పెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మహిళలకు అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికీ లేదని అన్నారు. కాంగ్రెస్‌తో సహా దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒకటేనని చెప్పుకొచ్చారు. మహిళా బిల్లు పాస్ అయ్యింది 2023లోనేనని ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు.


వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి..

2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలని షర్మిల సూచించారు. కులగణన ద్వారా SC, ST, OBCల సంఖ్య తేలాలని అన్నారు. కులాల ఆధారంగా డీ లిమిటేషన్‌లో రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుత 543 స్థానాలకు తక్షణం మహిళా రిజర్వేషన్లను పాటించాలని సూచించారు. చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని సమ్మతమైన పరిష్కారం చూపాలని అన్నారు. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి… దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ చెబితే గుడ్డిగా జగన్ సైతం నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 06:35 PM