Share News

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:34 PM

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్
AP High Court

అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy), ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనపై జారీ చేసిన ఎల్‌ఓసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు ఎలా పెడతారని న్యాయస్థానం ప్రశ్నించింది.


వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును సక్రమంగా చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోరినప్పుడు విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్ వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎల్ఓసీని రీ కాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్దన వచ్చిన వెంటనే ఎల్ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులకు ఏపీ హై కోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 06:39 PM