మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:49 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి మావిగన్ పేరుతో, ప్రజలనీ తప్పు దోవ పట్టిస్తున్నారని.. ఆయనకు మతిస్థితం లేదని ఎద్దేవా చేశారు.
నెల్లూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి మావిగన్ పేరుతో, ప్రజలనీ తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆయనకు మతిస్థితం లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు(మంగళవారం) నెల్లూరు జిల్లాలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని డ్రగ్ కల్చర్‌తో జగన్ అనే ఓ దుర్మార్గుడు భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు.
జువ్వలదిన్నెతో మత్స్యకార వర్గాలకు మంచి చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జువ్వలదిన్నెలో మొత్తం 950 మీటర్లలో 150 మీటర్లు మాత్రమే సాగర్ డిఫెన్స్‌కు ప్రభుత్వం ఇస్తోందని.. మిగతాది మత్స్యకారులకేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సముద్రతీర ప్రాంతాన్ని అంతటిని లేఅవుట్లు వేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఏ మొఖం పెట్టుకుని జగన్.. మళ్లీ మత్స్యకారుల దగ్గరకు వస్తావని ప్రశ్నించారు.
మత్స్యకారుల కోసం జగన్ రావటం లేదని.. కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్లు లాక్కునేందుకు వస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. రహదారులపై జగన్నాథ రథచక్రాలు తిరుగుతున్నాయని... వాటి కిందపడి వైసీపీ నాయకులే నలిగిపోతారని విమర్శించారు. ఆయన బెదిరింపులకు బెదిరేవారు ఎవరూ లేరని.. పులివెందులలో ఎంపీటీసీని గెలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ఉన్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ జువ్వలదిన్నెకి వీరభద్రుడిగా వస్తానంటే, ఒట్టి భద్రుడుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఎందుకులే అని తాము నిశ్శబ్దంగా ఉన్నామని.. తమ నాయకత్వం కళ్లు తెరిస్తే దబిడి దిబిడేనని మంత్రి ఆనం హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు
వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News