Share News

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:42 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తన తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనుడని సెటైర్లు గుప్పించారు.

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు
Minister Kinjarapu Atchennaidu

అమరావతి, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchennaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తన తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనుడని సెటైర్లు గుప్పించారు. ఆయన శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు(సోమవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి చరిత్ర ఈ రాష్ట్రానికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.


ఆ నాడు జగన్‌కు ఉన్న అధికార దాహం చూసే, ప్రజలు గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి వైసీపీ అడ్రస్ గల్లంతు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జనం ఆయనను ఛీత్కరించుకున్నా.. ఇంకా సిగ్గులేకుండా అమరావతిపై అబద్ధాలు, మావిగన్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా..? అని ధ్వజమెత్తారు. అమరావతిని అక్షయపాత్రగా మార్చి తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. జగన్ అండ్ కో అవినీతికి అది కామధేనువులా కనిపించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు పెట్టిన వాత ఇంకా పచ్చిగానే ఉందని, అది మర్చిపోయి మాట్లాడితే మళ్లీ అదే గతి పడుతుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బెట్టింగ్‌, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వైద్య రంగంలో సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 12:57 PM