‘అశ్వమేధం’ ద్వారా ఆశా భోంస్లేతో నాకు ప్రత్యేక అనుబంధం: బాలకృష్ణ
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:51 PM
అశ్వమేధం చిత్రం ద్వారా ఆశా భోంస్లేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రమఖ నటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఓపీ నయ్యర్, ఆర్.డి. బర్మన్‌తో కలిసి అద్భుతమైన ఎవర్‌గ్రీన్ పాటలు ఇచ్చారని తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే (92) తుది శ్వాస విడిచారు. నిన్న (శనివారం) సాయంత్రం ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించగా ఈరోజు (ఆదివారం) తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రమఖ నటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆశా భోంస్లే మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాల సంగీత ప్రయాణం ఆశా భోంస్లేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. అజరామర గాత్రంతో సంగీత ప్రియులను ఆశా భోంస్లే అలరించారని కీర్తించారు. అనేక భారతీయ భాషల్లో వేలాది వైవిధ్యభరిత గీతాలను ఆమె ఆలపించారని ప్రశంసించారు. అశ్వమేధం చిత్రం ద్వారా ఆశా భోంస్లేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్‌తో కలిసి అద్భుతమైన ఎవర్‌గ్రీన్ పాటలు ఇచ్చారని తెలిపారు. పద్మ విభూషణ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆమెకు దక్కాయని చెప్పారు. ఆశా భోంస్లే మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..
చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత
జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి
Read Latest AP News And Telangana News And International News And Telugu News