బస్సులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 10:24 AM
విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఘటన వివరాలిలా..
ఆటోనగర్ ప్రధాన రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశారు. మంటలు వేగంగా వ్యాపించకముందే డ్రైవర్ బస్సు నుంచి కిందకు దిగిపోయారు. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సురక్షితంగా ప్రయాణికులు..
ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ వెంటనే కిందకు దింపేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నడి రోడ్డుపై బస్సు తగలబడుతుండటంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు నడుస్తుండగా సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వైసీపీ నేత హైటెక్ మోసం.. ఆందోళనలో బాధితులు
స్థానిక ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్
భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
Read Latest AP News And Telangana News And International News And Telugu News