Share News

స్థానిక ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:17 PM

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

 స్థానిక ఎన్నికలపై  అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్
AP Minister NaraLokesh

అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister NaraLokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు(శుక్రవారం) మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని.. అందరు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. కార్యకర్తలను, నేతలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు.


మంత్రులు అందరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూర్తిగా అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా టీడీపీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్‌కు అందుబాటులో ఉండి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ ముఖ్యమనే విషయాన్ని అందరు గుర్తు పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఇచ్చే విజ్ఞప్తులను మనం పూర్తిస్థాయిలో పరిష్కరించాలని మంత్రి నారా లోకేశ్ మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 04:21 PM