Home » Election Campaign
ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే.. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం 37 ఏళ్ల నిషేధం తర్వాత కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వెల్లడించారు.
వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు తేదీలను ఏపీ మునిసిపల్ శాఖ ప్రకటించింది.
సర్ ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లో హై డెసిబుల్ ప్రచారం ముగిసింది. చివరి విడత పోలింగ్ 29న జరగనుంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారీ రోడ్ షో నిర్వహించారు.
ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మన సొంత ఇంటి పైకప్పులపైనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగల స్థాయికి మనం చేరుకున్నామని పేర్కొన్నారు.
ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకున్న రాజకీయ అనుభవంలో ఎంతో మంది నాయకులను చూశానని పేర్కొన్నారు.