Share News

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతారనే భయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:53 PM

సర్పంచ్ ఎన్నికల్లో చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతారనే భయం.. ఆ  తర్వాత ఏం జరిగిందంటే..!
Panchayat Elections

మెదక్ జిల్లా, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Election) చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న(శనివారం) రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏదో మతలబు ఉందని మిగిలిన అభ్యర్థులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.


డ్రోన్లు, జాగిలాలతో గాలించి జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు డ్రామా ఆడారనే ఆరోపణలు వస్తున్నాయి. తన భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. సానుభూతి ఓట్ల కోసం ఆమె ఇలా చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మిగిలిన అభ్యర్థులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 01:35 PM