Home » Telangana Sarpanch
సర్పంచ్ ఎన్నికల్లో చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. తొలి విడత ఈరోజు పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు రేపటి నుంచి కొనసాగనున్నాయి. నామినేషన్ల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
ఇది కేవలం ఒకరిద్దరి సర్పంచ్‌ల(Sarpanches) ఆవేదనే కాదు.. తెలంగాణ (Telangana) లో దాదాపు అన్ని గ్రామాల సర్పంచ్‌లదీ! గ్రామ పంచాయతీలు(Village Panchayats) నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయి.
తెలంగాణలో సర్పంచ్‌ల (TS Sarpanch) గోడు వినే నాథుడే లేడా..? ప్రజల కోసం (Public) తమవంతుగా సేవచేయడానికి వచ్చిన..