Share News

Konda Vishweshwar Reddy: కోతుల సమస్యపై లోక్‌సభలో చర్చించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN , Publish Date - Dec 04 , 2025 | 02:32 PM

తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

Konda Vishweshwar Reddy: కోతుల సమస్యపై లోక్‌సభలో చర్చించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
BJP Chevella MP Konda Vishweshwar Reddy

ఢిల్లీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (BJP Chevella MP Konda Vishweshwar Reddy) వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కోతుల సమస్యపై ఇవాళ(గురువారం) లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.


ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని కొన్ని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కోతుల సమస్య చిన్న విషయం లాగా అనిపిస్తోందని.. కానీ అందరూ ఈ సమస్య గురించి తెలుసుకుని నవ్వుతారని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉందని గుర్తుచేశారు.


ఈ విషయంలో నోడల్ ఏజెన్సీ అవసరమని చెప్పారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కోతుల సమస్యను ప్రజలు ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ సమస్య ఒక ఎజెండాగా మారిందని పేర్కొన్నారు. వానరాల సమస్యను పరిష్కరిస్తే సర్పంచ్‌గా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్

సెంటిమెంట్‌ రగిల్చి లబ్ది పొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 02:50 PM