Police Website Hacked: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:13 AM
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
హైదరాబాద్, డిసెంబర్ 4: సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లు కూడా హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి.

వెబ్ సైట్ల పునరుద్ధరణకు నేషనల్ ఇన్ఫర్‌మేటిక్స్ సెంటర్ (NIC) పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు పనిచేస్తున్నారు. రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు అప్డేట్ చేయిస్తున్నారు. మరోసారి హ్యాకింగ్‌కు గురి కాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఐటీ టీమ్ ఆడిట్ చేస్తోంది. రెండు కమిషనరేట్లకు చెందిన వెబ్‌సైట్లకు హ్యాకింగ్ చేసిన ముఠాను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్
పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News