Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:39 AM
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 4: నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు పాతబస్తీ రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్ (30)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జునైద్‌ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచారని.. తీవ్రంగా గాయపడిన జువైద్‌ను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. అనంతరం జునైద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే నిందితులు, బాధితుడు ఇద్దరూ కూడా బంధువులే అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిర్చోక్ శ్యామ్ సుందర్ తెలిపారు. జువైద్‌ను ఎందుకు హత్య చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్
Read Latest Telangana News And Telugu News