Greater Hyderabad: విలీనం.. ఇక అధికారికం
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:51 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.
- జీఓ నం. 264 విడుదల
- జీహెచ్‌ఎంసీలోకి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు
- పురపాలక శాఖ ఉత్తర్వులు.. రంగంలోకి బల్దియా
- రికార్డుల స్వాధీనం, బ్యాంకు ఖాతాల స్తంభన
- డీఎంసీలకు బాధ్యతలు..
- రాత్రే కార్యాలయాలకు అధికారులు
- సమగ్ర సమాచారం సేకరణ
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీలో శివార్లలోని 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల విలీనం అధికారికంగా పూర్తయ్యింది. ఈ మేరకు పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు (జీఓ-264) జారీ చేసింది. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల కౌన్సిల్ తీర్మానాలు, మినిట్స్ బుక్ సీజ్, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసి అందులోని డబ్బులను జీహెచ్‌ఎంసీ ఖాతాలోకి బదిలీ, కార్యాలయాలకు జీహెచ్‌ఎంసీ పేరిట బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 30 మంది డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ల (డీఎంసీ)లకు బాధ్యతలు అప్పగిస్తూ సాయంత్రం 6 గంటల సమయంలో ప్రొసీడింగ్స్ రాగా, రాత్రే డీఎంసీలు రంగంలోకి దిగారు. కార్యాలయాలకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాల ఫ్రీజ్‌కు లేఖలు సిద్ధం చేశారు.

రికార్డుల స్వాధీనం
నిర్మాణ అనుమతులు జారీ చేయకుండా, బిల్లులు చెల్లించకుండా పాలనా వ్యవహారాలను స్తంభింప చేశారు. మునిసిపాలిటీ స్వరూపం, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు, స్థిర, చరాస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు, పన్నులు, పన్నేతర ఆదాయం, ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బిల్లులు, మూడేళ్లలో జారీ చేసిన భవన నిర్మాణ/లే అవుట్ అనుమతుల జారీ వివరాలు సేకరించాలని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. రికార్డులు స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు.
మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనం, డేటా బదిలీకి సహకరించాలని మంగళవారమే కర్ణన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్‌కు లేఖ రాశారు. వివరాల సేకరణ, రికార్డుల స్వాధీనానికి సంబంధించిన ప్రొఫార్మాను ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. విలీన మునిసిపాల్టీలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించనున్నారు. మునిసిపాలిటీ ఏర్పాటు? విస్తీర్ణం, గ్రేడ్, 2001, 2011 లెక్కల ప్రకారం జనాభా, ప్రస్తుతం ఉన్న కుటుంబాలు, వార్డులు, మురికివాడలు, ఉద్యోగులు, మూడేళ్లుగా ఆదాయ, వ్యయాలు, మార్కెట్లు, తదితర వివరాలన్నీ ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్న ఫార్మాట్‌లో సేకరించాలని సూచించారు.
విలీనమైన ప్రాంతాలు, అధికారుల వివరాలు
సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జోన్
1. ఆదిభట్ల ఎన్.బాలకృష్ణ చార్మినార్
2. బడంగ్‌పేట్ పి.సరస్వతి చార్మినార్
3. బండ్లగూడ జాగీర్ బి.శరత్‌చంద్ర శేరిలింగంపల్లి
4. జల్‌పల్లి బి.వెంకట్రామ్ చార్మినార్
5. మణికొండ జే.శంకర్ జాయింట్ కమిషనర్
(హెల్త్) జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి
6. మీర్‌పేట్ ఏ.నాగమణి ఎల్‌బీనగర్
7. నార్సింగి టి.కృష్ణమోహన్‌రెడ్డి శేరిలింగంపల్లి
8. పెద్ద అంబర్‌పేట్ ఎస్.రవీందర్‌రెడ్డి ఎల్‌బీనగర్
9. శంషాబాద్ బి.సుమన్‌రావు చార్మినార్
10. తుక్కుగూడ ఏ.వాణి ఎల్‌బీనగర్
11. తుర్కయాంజల్ బి. సత్యనారాయణరెడ్డి చార్మినార్
12. బోడుప్పల్ ఏ.శైలజ సికింద్రాబాద్
13. దమ్మాయిగూడ ఎన్.వెంకటరెడ్డి ఎల్‌బీనగర్
14. దుండిగల్ ఎన్.వెంకటేశ్వరనాయక్ కూకట్‌పల్లి
15. ఘట్‌కేసర్ పి.రాజేష్ ఎల్‌బీనగర్
16. గుండ్లపోచంపల్లి ఆర్.వెంకటగోపాల్ కూకట్‌పల్లి
17. జవహర్‌నగర్ ఎన్.వసంత సికింద్రాబాద్
18. కొంపెల్లి ఎన్.కృష్ణారెడ్డి కూకట్‌పల్లి
19. మేడ్చల్ కె.చంద్రప్రకాష్ కూకట్‌పల్లి
20. నాగారం ఎస్.భాస్కర్‌రెడ్డి సికింద్రాబాద్
21. నిజాంపేట్ ఎండీ.సాబీర్ అలీ కూకట్‌పల్లి
22. ఫీర్జాదిగూడ టీఎ్‌సవీఎన్ త్రిలేశ్వర్‌రావు ఎల్‌బీనగర్
23. పోచారం ఎస్. నిత్యానంద్ ఎల్‌బీనగర్
24. తూముకుంట ఎంఎన్‌ఆర్ జ్యోతి సికింద్రాబాద్
25. అమీన్‌పూర్ ఏ.జ్యోతిరెడ్డి శేరిలింగంపల్లి
26. బొల్లారం బి.కిషన్ కూకట్‌పల్లి
27. తెల్లాపూర్ ఎస్.అజయ్‌కుమార్‌రెడ్డి శేరిలింగంపల్లి
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News