Share News

Mahesh Goud: సెంటిమెంట్‌ రగిల్చి లబ్ధిపొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:14 PM

బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Mahesh Goud: సెంటిమెంట్‌ రగిల్చి లబ్ధిపొందే యత్నం.. బీఆర్‌ఎస్‌పై పీసీసీ చీఫ్ ఫైర్
Mahesh Goud

హైదరాబాద్, డిసెంబర్ 4: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సెంటిమెంట్ రగల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేవుళ్ల విషయంలో సీఎం ఒక సామెతగా చెప్పారని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.


హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్‌లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని వెల్లడించారు మహేష్ గౌడ్. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని తెలిపారు. అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు.


కాగా.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభ‌ను రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా వి.హనుమంతరావును రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సత్కరించింది. అలాగే రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్కాలర్ షిప్‌లు అందజేశారు.


ఇవి కూడా చదవండి

పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 01:55 PM