Share News

Fire Incident:తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:28 AM

వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని ఓ ఫర్టీలైజర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి మంటలు  ఎగసిపడున్నాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

 Fire Incident:తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
Vikarabad Fire Accident

వికారాబాద్ జిల్లా, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని ఓ ఫర్టీలైజర్ షాప్‌లో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం (Vikarabad Fire Accident) జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు  ఎగసిపడున్నాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. నీటితో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు స్థానికులు. ఈక్రమంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు.


సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన విషయాన్ని ఫర్టీలైజర్ షాప్‌ నిర్వాహకులకు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఈ ఘటన జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు

హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 10:35 AM