Telangana Government: పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:57 AM
ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదగా ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ తెలిపారు.
» 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను (National Book Fair) ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదగా ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ తెలిపారు. 300కుపైగా స్టాళ్లతో డిసెంబరు 29 దాకా రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి లోకకవి అందెశ్రీ పేరు పెట్టామని ప్రకటించారు.
సొసైటీ శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో యాకూబ్ మాట్లాడారు. ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకావిష్కరణ వేదికకు కొంపెల్లి వెంకట్రెడ్, రచయితల స్టాళ్లకు సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు, మీడియా స్టాళ్లకు జర్నలిస్టు స్వేచ్ఛా వొటార్కర్ పేర్లు పెడుతున్నట్లు వివరించారు. ఈ ఏడాది నుంచి పరిమిత సంఖ్యలోనే రిమైండర్(సెకండ్ హ్యాండ్) పుస్తకాల స్టాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, రచయితల స్టాల్ ధర రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ప్రవేశ రుసుంను రూ.10 నుంచి 20కు పెంచాలని మొదట నిర్ణయించగా.. తీవ్ర అభ్యంతరాలతో వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News