Share News

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:10 PM

పత్రికల్లో, మీడియాల్లో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అలా కాకుండా మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
Venkaiah Naidu

చిత్తూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పత్రికల్లో, మీడియాల్లో ఏమైనా అసత్య ప్రసారాలు వస్తే వాటిపైన శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. అలా కాకుండా మీడియాపై భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడటం ఏ రాజకీయ పార్టీలకైనా తగదని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై భౌతిక దాడులకు పాల్పడితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈరోజు(గురువారం) చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళ కళాశాల స్నాతకోత్సవానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కళాశాల ఆవరణలో చిత్తూరు మాజీ ఎంపీ చంగల్రాయ నాయుడు సహకారంతో నూతనంగా నిర్మించిన మహిళ వసతి భవనానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు.


మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్లే..

మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్లేనని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. జన్మనిచ్చిన తల్లి ఊరు, దేశాన్ని ఎవరు మరువకూడదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు యువత సోషల్ మీడియా ఊబిలో పడవద్దని సూచించారు. మనిషి జీవన ప్రమాణం మెరుగుపడాలంటే అందుకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదని అన్నారు. విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం చదువుతోపాటు ఆటలకు ఇవ్వాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోగ్యం కోసం తీసుకువచ్చిన యోగా కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయని.. అమలు చేయడానికి శ్రీకారం చుట్టాయని ప్రస్తావించారు. తాను రాజకీయ వారసత్వానికి వ్యతిరేకినని.. కానీ సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాల వారసత్వాన్ని ప్రోత్సహిస్తానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

జగన్‌ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు

రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 01:42 PM